ప్రార్ధన వినెడి పావనుడా | Prardhana vinedi pavanuda Song Lyrics in Telugu
Song Name: Prardhana vinedi pavanuda
Telugu Lyrics
పల్లవి: ప్రార్ధన వినెడి పావనుడా – ప్రార్ధన మాకు
నేర్పుమయా
||ప్రార్ధన||
1. శ్రేష్ఠమైన భావము గూర్చి – శిష్యబృందముకు నేర్పితివి (2)
పరముడ నిన్ను – ప్రణుతించెదము – పరలోక ప్రార్ధన
నేర్పుమయా (2)
||ప్రార్ధన||
2. పరమ దేవుడవని తెలిసి – కరము లెత్తి జంటగ మోడ్చి (2)
శిరమును వంచి సరిగమ వేడిన – సుంకరి ప్రార్ధన
నేర్పుమయా (2)
||ప్రార్ధన||
3. దినదినంబు చేసిన సేవ – దైవ చిత్తముకు సరిపోవ (2)
దీనుడవయ్యు దిటముగ కొండను – చేసిన ప్రార్ధన
నేర్పుమయా (2)
||ప్రార్ధన||
4. శత్రుమూక నిను చుట్టుకొని – సిలువపై నిను
జంపగను (2)
శాంతముతో నీ – శత్రుల బ్రోవగ – సలిపిన ప్రార్ధన
నేర్పుమయా (2)
||ప్రార్ధన||
Watch Song
For More Songs
Christmas Songs
New Year Songs