Song Name: Jeevithaanthamu Varaku Neeke
Telugu Lyrics
పల్లవి: జీవితాంతము వరకు నీకే – సేవ సల్పుదునంటిని
నీవు నాతో నుండి ధైర్యము – నిచ్చి నడుపుము రక్షకా
||జీవితాంతము||
1. ఎన్ని యాటంకంబులున్నను – ఎన్ని భయములు కల్గిన
అన్ని పోవును నీవు నాకడ – నున్న నిజమిది రక్షకా
||జీవితాంతము||
2. అన్ని వేళల నీవు చెంతనె – యున్న యను భవమీయవె
తిన్నగా నీ మార్గమందున – పూనినడచెద రక్షకా
||జీవితాంతము||
3. నేత్రములు మిరుమిట్లు గొలిపెడి – చిత్రదృశ్యములున్నను
శత్రువగు సాతాను గెల్వను – చాలు నీ కృప రక్షకా
||జీవితాంతము||
4. నాదు హృదయమునందు వెలుపట – నావరించిన శత్రులన్
చెదర గొట్టుము రూపుమాపుము – శ్రీఘ్రముగ నారక్షకా
||జీవితాంతము||
5. మహిమలో నీవుండు చోటికి – మమ్ము జేర్చెదనంటివే
ఇహము దాటినదాక నిన్ను – వీడనంటిని రక్షకా
||జీవితాంతము||
6. పాప మార్గము దరికి బోవక – పాత యాశల గోరక
ఎపుడు నిన్నే వెంబడింపగ – కృప నొసంగుము రక్షకా
||జీవితాంతము||
English Lyrics
Jeevithaanthamu Varaku Neeke – Seva Salpudunantini
Neevu Naatho Nundi Dhairyamu – Nichchi Nadupumu Rakshakaa
||Jeevithaanthamu||
1. Enni Yaatankambulunnanu – Enni Bhayamulu Kalgina
Anni Povunu Neevu Naakada – Nunna Nijamidi Rakshakaa
||Jeevithaanthamu||
2. Anni Velala Neevu Chenthane – Yunna Yanubhavameeyave
Thinnagaa Nee Maargamanduna – Pooni Nadacheda Rakshakaa
||Jeevithaanthamu||
3. Nethramulu Mirumitlu Golipedi – Chithra Drushyamulunnanu
Shathruvagu Saathaanu Gelvanu – Chaalu Nee Krupa Rakshakaa
||Jeevithaanthamu||
4. Naadu Hrudayamunandu Velupata – Naavarinchina Shathrulan
Chedara Gottumu Roopumaapumu – Sheeghramuga Naa Rakshakaa
||Jeevithaanthamu||
5. Mahimalo Neevundu Chotiki – Mammu Jerchedanantive
Ihamu Daatina Daaka Ninnu – Veedanantini Rakshakaa
||Jeevithaanthamu||
6. Paapa Maargamu Dariki Bovaka – Paatha Yaashala Goraka
Epudu Ninne Vembadimpaga – Krupa Nosangumu Rakshakaa
||Jeevithaanthamu||