Song Name: Koniyaada Tharame Ninnu Komala Hrudaya
Telugu Lyrics
పల్లవి: కొనియాడ తరమే నిన్ను
కోమల హృదయ – కొనియాడ తరమే నిన్ను
తనరారు దినకరు – బెను తారలను మించు (2)
ఘన తేజమున నొప్పు – కాంతిమంతుడ వీవు
||కొనియాడ||
1. కెరుబులు సెరుపులు – మరి దూత గణములు (2)
నురుతరంబుగ గొలువ – నొప్పు శ్రేష్ఠుడ వీవు
||కొనియాడ||
2. సర్వ లోకంబుల – బర్వు దేవుడ వయ్యు (2)
నుర్వి స్త్రీ గర్భాన – నుద్భవించితి వీవు
||కొనియాడ||
3. విశ్వమంతయు నేలు – వీరాసనుడ వయ్యు (2)
పశ్వాళితో దొట్టి – పండియుంటివి వీవు
||కొనియాడ||
4. దోసంబులను మడియు – దాసాళి కరుణించి (2)
యేసు పేరున జగతి – కేగుదెంచితి నీవు
||కొనియాడ||
5. నరులయందున కరుణ – ధర సమాధానంబు (2)
చిరకాలమును మహిమ – పరగ జేయుదు వీవు
||కొనియాడ||
6. ఓ యేసు పాన్పుగ – నా యాత్మ జేకొని (2)
శ్రేయముగ పవళించు – శ్రీకర వరసుత
||కొనియాడ||
English Lyrics
Koniyaada Tharame Ninnu
Komala Hrudaya – Koniyaada Tharame Ninnu
Thanaraaru Dinakaru – Benu Thaaralanu Minchu (2)
Ghana Thejamuna Noppu – Kaanthimanthuda Veevu
||Koniyaada||
1. Kherubulu Serupulu – Mari Dootha Ganamulu (2)
Nurutharambuga Goluva – Noppu Shreshtuda Veevu
||Koniyaada||
2. Sarva Lokambula – Barvu Devuda Vayyu (2)
Nurvi Sthree Garbhaana – Nudbhavinchithi Veevu
||Koniyaada||
3. Vishwamanthayu Nelu – Veeraasanuda Vayyu (2)
Pashvaalitho Dotti – Pandiyuntivi Veevu
||Koniyaada||
4. Dosambulanu Madiyu – Daasaali Karuninchi (2)
Yesu Peruna Jagathi – Kegudenchithi Neevu
||Koniyaada||
5. Narulayanduna Karuna – Dhara Samaadhaanambu (2)
Chirakaalamunu Mahima – Paraga Jeyudu Veevu
||Koniyaada||
6. O Yesu Paanpuga – Naa Yaathma Jekoni (2)
Shreyamuga Pavalinchu – Shreekara Varasutha
||Koniyaada||