ఎడబాయని నీ కృప | Yeddabaayani Nee Krupa Song Lyrics in Telugu | Pastor Mathews
Song Name: Yeddabaayani Nee Krupa
Telugu Lyrics
పల్లవి: ఎడబాయని నీ కృప
నను విడువదు ఎన్నటికీ (2)
యేసయ్యా నీ ప్రేమానురాగం
నను కాయును అనుక్షణం (2)
||ఎడబాయని||
1. శోకపు లోయలలో – కష్టాల కడగండ్లలో
కడలేని కడలిలో – నిరాశ నిసృహలో (2)
అర్ధమేకాని ఈ జీవితం
ఇక వ్యర్థమని నేననుకొనగ (2)
కృపా కనికరముగల దేవా
నా కష్టాల కడలిని దాటించితివి (2)
||ఎడబాయని||
2. విశ్వాస పోరాటంలో – ఎదురాయె శోధనలు
లోకాశల అలజడిలో – సడలితి విశ్వాసములో (2)
దుష్టుల క్షేమమునే చూచి
ఇక నీతి వ్యర్థమని అనుకొనగ (2)
దీర్ఘశాంతముగల దేవా
నా చేయి విడువక నడిపించితివి (2)
||ఎడబాయని||
3. నీ సేవలో ఎదురైన – ఎన్నో సమస్యలలో
నా బలమును చూచుకొని – నిరాశ చెందితిని (2)
భారమైన ఈ సేవను
ఇక చేయలేనని అనుకొనగ (2)
ప్రధాన యాజకుడా యేసు
నీ అనుభవాలతో బలపరిచితివి (2)
||ఎడబాయని||
Watch This Song
For More Songs
Christmas Songs
New Year Songs