శతకోటి వందనాలు నా యేసయ్య | Sathakoti Vandanalu Yesayya Song Lyrics in Telugu | New Year Telugu Song
Song Name: Sathakoti Vandanalu Yesayya
Telugu Lyrics:
పల్లవి: శతకోటి వందనాలు నా యేసయ్య
గతమంతా నీ కృపలో కాచితివయ్యా (2)
అను పల్లవి: నూతన బలము నూతన శక్తి మా కొసగుమయ్యా
ఎనలేని నీ ప్రేమని మాపై చూపించావయ్యా (2)
||శతకోటి||
1. శ్రమలు శోధనలు ఇరుకు ఇబ్బందులు
ఎన్నెన్నో కలిగి కన్నీరు విడిచిన (2)
కన్నీరు నాట్యముగ మార్చి వేసినావు
మా తోడు నీవై నడిపించినావు (2)
||నూతన బలము||
2. ఆత్మీయ యాత్రలో అలసి పోయినా
నీ శక్తితో నింపి బలపరచినావు (2)
పక్షి రాజు వలే నన్ను పైకెగరజేసి
ఆకాశ వీధిలో విహరింప జేశావు (2)
||నూతన బలము||
3. దినములు జరిగించుచుండగా
నీ కార్యములు నూతన పరచుము నా యేసయ్య (2)
ఈ సమయములో మెండైన దీవెనలు
కురిపించుమయా కృప గల దేవా (2)
||నూతన బలము||