సర్వోన్నతుడ విజయవీరుడ | Sarvonathuda VijayaVeeruda
Telugu Lyrics
పల్లవి: సర్వోన్నతుడ విజయవీరుడ
ప్రియుడ నా శిల్పకారుడ
ఎవ్వరు లేరు నాకు యేసయ్యా
నీ సన్నిది చాలు నాకు మేసయ్యా (2)
అనుపల్లవి: ఇంతకంటె భాగ్యమేంటయ్యా
నాకు నీకంటె ఘనులెవరయ్యా (2)
1. గడచిన కాలంలో కనురెప్పలా
నీ చాటున దాచిన నా గొప్ప కాపరి (2)
వేల్పులలో నీవు మహనీయుడవు (2)
నన్నెన్నడు యెడబాయని తండ్రివి నీవే
నా తండ్రివి నీవే
||ఇంతకంటె||
2. దయగలదేవుడవీ ధరణీయందున
వ్యర్ధుడు చెరపలేడు నా క్షేమమును (2)
నే గాడాంధకారపు లోయలో నడిచినను (2)
నీ దుడ్డు కర్ర ధండము ఆదరించునే
నన్నాదరించునే
||ఇంతకంటె||
3. రాబోవు శ్రేష్ఠమైన రాజ్యము కొరకు
వెనుదీయక గురి యొద్దకు సాగివెళ్ళదన్ (2)
నిర్జీవ గడియలు నిలదీసినగాని (2)
నా మనస్సు నీపైనే ఆనుకొందునే
నేననుకొందునే
||ఇంతకంటె||
4. విమర్శలకు కృంగను నా హృదయమందున
నా స్థితిని మార్చేస్తుతి పాత్రుడుండగ (2)
పునరుద్ధానుడ నా పితరులదేవా (2)
జయమునిచ్చు క్షేత్రములో యాత్ర చేసెదన్
నే యాత్ర చేసిదన్
||ఇంతకంటె||
English Lyrics
Sarvonathuda VijayaVeeruda
Priyudu na shilpakaaruda
Yevvaru leru naaku yesayya
Nee sannidi chaalu naaku mesayya (2)
Inthakamte bhagyamentayya
Naaku neekamte ghanulevarayya (2)
1. Gadachina kaalamlo kanureppalaa
Nee chaatuna daachina naa goppa kaapari (2)
Velpulaloo neevu mahaneeyudavu (2)
Nannennadu yedabaayani thandrivineeve
Naa thandrivi neeve
||Intakamte||
2. Dayagaladevudivi dharaniyanduna
Vyarthudu cherapaleedu naa ksheemamunu (2)
Ne gaadandhakarapu loyaloo nadichinanu (2)
Nee duddu karra dhandamu aadharinchune
Nannaadarinchune
||Intakamte||
3. Raabovu shreshtamaina raajyamu koraku
Venudeeiyaka guri yoddaku saagivelladan (2)
Nirjeeva gadiyalu niladeesinagaani (2)
Naa manassu neepaine aanukondune
Ne naanu kondune
||Intakamte||
4. Vimarshalaku kringanu naa hrudayamanduna
Naa sthitini maarchestuti paatrudundanga (2)
Punaruddaanuda naa pitaruladeva (2)
Jayamunichu kshetramulo yaatra chesedan
Ne yaatra chesidan
||Intakamte||