Oneness Season 2 Song Lyrics

Oneness Season 2 Song Lyrics

Oneness Season 2 Song Lyrics in Telugu

1. దావీదు వలె నాట్యమాడి – తండ్రినీ స్తుతించెదము (2)
యేసయ్యా స్తోత్రముల్ (4)
తంబూరతోను సీతారాతోను – తండ్రినీ స్తుతించెదము (2)
యేసయ్యా స్తోత్రముల్ (4)

2. దేవునియందు నిరీక్షణ నుంచి – ఆయనను స్తుతించు నా ప్రాణమా (2)
నీకు సహాయము చేయువాడు – సదా ఆదుకొనువాడు ఆయనే (2)
ఆధారము – ఆదరణ – ఆయనలో (2)

3. నడిపించు నా నావ – నడి సంద్రమున దేవా
నవ జీవన మార్గమున – నా జన్మ తరియింప
నడిపించు నా నావా
నా జీవిత తీరమున – నా అపజయ భారమున
నలిగిన నా హృదయమును – నడిపించుము లోతునకు
నా యాత్మ విరబూయ – నా దీక్ష ఫలియింప
నా నావలో కాలిడుము – నా సేవ చేకొనుము
నడిపించు నా నావా

4. యేసే నా పరిహారి – ప్రియ యేసే నా పరిహారి
నా జీవిత కాలమెల్ల – ప్రియ ప్రభువే నా పరిహారి (2)
ఎన్ని కష్టాలు కలిగిననూ – నన్ను క్రుంగించె బాధలెన్నో (2)
ఎన్ని నష్టాలూ వాటిల్లినా – ప్రియా ప్రభువే నా పరిహారి (2)

5. అన్ని నామములకన్నా పై నామము – యేసుని నామము
ఎన్ని తరములకైనా ఘనపరచదగినది – క్రీస్తేసు నామము
యేసు నామము జయం జయము – సాతాను శక్తుల్ లయం లయము (2)
హల్లెలూయా హోసన్నా హల్లెలూయా – హల్లెలూయా ఆమెన్ (2)
సాతాను పై అధికారమిచ్చును – శక్తి గలగిన యేసు నామము (2)
శత్రు సమూహముపై జయమునిచ్చును – జయశీలుడైన యేసు నామము (2)

6. పరమ జీవము నాకు నివ్వ – తిరిగి లేచెను నాతో నుండ (2)
నిరంతరము నన్ను నడిపించును – మరల వచ్చి యేసు కొనిపోవును (2)
యేసు చాలును – యేసు చాలును
యే సమయమైనా యే స్థితికైనా – నా జీవితములో యేసు చాలును
సాతాను శోధనలధికమైన – సొమ్మసిల్లక సాగి వెళ్లెదను (2)
లోకము శరీరము లాగినను – లోబడక నేను వెళ్ళెదను (2)

7. నా దాగు చోటు నీవే – నా ఆశ్రయ దుర్గమా (2)
నా కేడెము కోట నీవే (2)
నా రక్షణ శృంగమా
నా దాగు చోటు నీవే – నా ఆశ్రయ దుర్గమా

8. రండి ఉత్సహించి పాడుదాము – రక్షణ దుర్గము మన ప్రభువే
మన ప్రభువే మహా దేవుండు – ఘన మహత్యము గల రాజు
భూమ్యాగాధపు లోయలను – భూధర శిఖరములాయనవే
రండి ఉత్సహించి పాడుదాము – రక్షణ దుర్గము మన ప్రభువే

9. రాజాధి రాజు దేవాది దేవుడు – త్వరలో వచ్చుచుండెను (2)
మన యేసు రాజు వచ్చును – పరిశుద్దులన్ చేయు మనలన్ (2)
ఆహా మన మచట కేగుదము (2)

10. నూతన గీతము పాడెదను – నా ప్రియుడేసునిలో (2)
హల్లెలూయా హల్లెలూయా – హల్లెలూయా ఆమెన్ (2)
యేసే నా మంచి కాపరి – యేసే నా గొప్ప కాపరి
యేసే నా ప్రధాన కాపరి – యేసే నా ఆత్మ కాపరి
యేసే నన్ను కొన్న కాపరి – యేసే నాలో ఉన్న కాపరి (2)

11. యెహోవా నా కాపరి నాకు లేమిలేదు – పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్ (2)
నూనెతో నా తలను – అభిషేకము చేయున్
నా హృదయము నిండి – పొర్లుచున్నది (2)

12. నాకెన్నో మేలులు చేసితివి
నీకేమి చెల్లింతును – దేవా నీకేమి అర్పింతును (2)
హల్లెలూయా యేసునాధా – కృతజ్ఞత స్తుతులు నీకే (2)
నాకిక ఆశలు లేవనుకొనగా
నా ఆశ నీవైతివే – ఆశలు తీర్చితివే
నలుదిశల నన్ను భయమావరింప
నా పక్షమందుంటివే – నాకభయమిచ్చితివే
హల్లెలూయా యేసునాధా – కృతజ్ఞత స్తుతులు నీకే (2)

13. మహోన్నతుడా – నీ కృపలో నేను నివసించుట
నా జీవిత ధన్యతయై యున్నది (2)
మహోన్నతుడా – నీ కృపలో నేను నివసించుట (2)
నా జీవిత ధన్యతయై యున్నది (2)

14. నే సాగేద యేసునితో – నా జీవిత కాలమంతా (2)
యేసుతో గడిపెద యేసుతో నడిచెద (2)
పారమును చేరగ నే వెళ్లేద (2)
హానోకు వలె సాగెదా

15. నేడో రేపో నా ప్రియుడేసు – మేఘాలమీద ఏతించెను (2)
మహిమాన్వితుడై ప్రభు యేసు – మహి స్థలమునకు ఏతించెను (2)
నేడో రేపో నా ప్రియుడేసు – మేఘాలమీద ఏతించెను

16. యేసు ప్రభువును బట్టి మా స్తోత్రములు
అందుకుందువని స్తుతి చేయుచున్నాము
దేవా నీవే స్తోత్ర పాత్రుడవు – నీవు మాత్రమే మహిమ రూపివి
దేవా నీవే స్తోత్ర పాత్రుడవు

17. రమ్మనుచున్నాడు – నిన్ను ప్రభు యేసు
వాంఛతో తన కరము చాపి – రమ్మనుచున్నాడు (2)

18. ప్రేమా … ప్రేమా – ప్రేమా … ప్రేమా … (2)

19. ఎంత మధురము యేసుని ప్రేమ
ఎంత మధురము నా యేసుని ప్రేమ (2)

20. మహిమ నీకే ప్రభు – ఘనత నీకే ప్రభు (2)
స్తుతి మహిమ ఘనతయు – ప్రభావము నీకే ప్రభు (2)
ఆరాధనా… ఆరాధనా… (2)
నా యేసు ప్రభునకే – ప్రియ యేసు ప్రభునకే

21. ఆరాధనకు యోగ్యుడా – నిత్యము స్తుతియించెదను
నీ మేలులను మరువకనే – ఎల్లప్పుడు స్తుతి పాడెదను
ఆరాధనా… ఆరాధనా… (2)
నీ మేలులకై ఆరాధన – నీ దీవెనకై ఆరాధన (2)
ఆరాధనా… ఆరాధనా… (2)

Oneness Season 2 Song Lyrics in English

1. Daavidu vale naatyamaadi – Thandrini stutinchedamu (2)
Yesayya stothramul (4)
Thamburathonu sitharathonu – Thandrini stutinchedanu (2)
Yesayya stothramul (4)

2. Devuniyandu nireekshana nunchi – Aayananu stutinchu naa praanama (2)
Neeku sahayamu cheyuvaadu – Sada aadhukonuvaadu aayane (2)
Aadharamu – Aadharana – Aayanalo (2)

3. Nadipinchu naa naava – Nadi sandramuna devaa
Nava jeevana maargamuna – Naa janma thariyimpa
Nadipinchu naa naava
Naa jeevitha theeramuna – Naa apajaya bharamuna
Naligina hrudayamunu – Nadipinchumu lothunaku
Naa aathma virabuya – Naa dheeksha phaliyimp
Naa naavalo kaalidumu – Naa seva chekonumu
Nadipinchu naa naava

4. Yese naa parihari – Priya yese naa parihari
Naa jeevitha kaalamella – Priya yese naa parihaari (2)
Enni kashtaalu kaliginanu – Nannu kruginche bhadelenno (2)
Enni nashtalu vaatillinaa – Priya prabhuve naa parihari (2)

5. Anni naamamula kannapai naamamu -Yesuni naamau
Enni tharamulakaina ghana paracha daginadhi – Kreesthesu naamamu
Yesu naamamu jayam jayamu
Shaatanu shakthulu layam layamu (2)
Hallelooya hosanna Hallelooya – Hallelooya Amen (2)
Shaatanu pai adhikaara michunu -shakthi galigina yesu namamu (2)
Shatru samuhamupai jayamunichunu – Jayasheeludaina yesu naamamu (2)

6. Parama jeevamu naaku nivva – Thirigi lechenu naatho nunda (2)
Nirantharamu nannu nadipinchunu – Marala vachhi yesu konipovunu (2)
Yesu chaalunu – Yesu chaalunu
Ye samayamaina ye sthithikaina – Naa jeevithamulo yesu chaalunu
Shaatanu shodanalu adhikamaina – Sommasillaka saagi velledhanu (2)
Lokamu shareeramu laaginanu – Lobadaka nenu velledhanu (2)

7. Naa daagu chotu neeve – Naa aadhraya durgamaa (2)
Naa kedemu kota neeve (2)
Naa rakshana srungamaa
Naa daagu chotu neeve – Naa aashraya durgamaa

8. Randi utsaahinchi paadudamu – Rakshana durgamu mana prabhuve
Mana prabhuve maha devundu – Ghana mahathyamu gala raju
Bhumyagaadhapu loyalanu – Bhudhara shikaramulayanave
Randi utsaahinchi paadudamu – Rakshana durgamu mana prabhuve

9. Rajadi raju devadi devudu – Twaralo vachuchundenu (2)
mana yesu raju vachhunu – Parishudulan cheyu manalan (2)
Aha mana machata kegudamu (2)

10. Noothana geethamu paadedanu – naa priyudesunilo (2)
Hallelooya Hallelooya – Hallelooya Amen (2)
Yese naa manchi kaapari – Yese naa goppa kapari
Yese naa pradhana kapari – Yese naa aathma kaapari (2)
Yese nannu kona kaapari – Yese naalo unna kaapari (2)

11. Yehova naa kaapari naaku lemi ledu – pacchika gala chotla machikatho nadupun (2)
Noonetho naa thalanu – Abhishekamu cheyun
Naa hrudayamu nindi – Porluchunnadi (2)

12. Nakenno melulu chesithive
Neekemi chellinthunu – deva neekemi arpinthunu (2)
Hallelooya yesu naadha – Kruthagnatha sthuthulu neeke (2)
Naakika aashalu levanukonagaa
Naa aasha neevaithive – Aashalu theerchithive
Naludhisala nannu bhayamavarimpa
Naa pakshamanduntive – Naakabhayamichithive
Hallelooya yesu naadha – Kruthagnatha sthuthulu neeke (2)

13. Mahonnathuda – Nee krupao nenu nivasinchuta
Naa jeevita dhanyathai vunnadi (2)
Mahonnathuda – Nee krupao nenu nivasinchuta (2)
Naa jeevita dhanyathai vunnadi (2)

14. Ne saageda yesunitho – Naa jeevitha kaalamanthaa
Yesutho gadipeda yesutho nadicheda (2)
Paramunu cheraga ne velleda (2)
Haanoku vale saageda

15. Nedo repu naa priyudesu – Meghalameeda yethinchenu (2)
Mahimanvithudai prabhu yesu – Mahi sthalamunaku yethinchenu
Nedo repu naa priyudesu – Meghalameeda yethinchenu

16. Yesu prabhuvunu batti maa sthothramulu
Andukunduvani sthuthi cheyuchunaamu
Deva neeve sthothra paathrudavu – Neevu maathrame mahima roopivi
Deva neeve sthothra paathrudavu

17. Rammanuchunnadu – Ninnu prabhu yesu
Vanchatho thana karamu chaapi – Rammanuchunnadu (2)

18. Prema … Prema – Prema … Prema… (2)

19. Yentha madhuramu yesuni prema
Yentha madhuramu naa yesuni prema (2)

20. Mahima neeke prabhu – Ghanatha neeke prabhu (2)
Sthuthi mahima ghanathayu – Prabhavamu neeke prabhu (2)
Aaradhana .. Aaradhana.. (2)
Naa yesu prabhu nake – Priya yesu prabhunake

21. Aaradhanaku yogyudaa – Nithyamu sthuthiyinchedamu
Nee mellulanu maruvakane – Yellapudu sthuthi paadedhanu
Aaradhana .. Aaradhana.. (2)
Nee mellulake aaradhana – Nee deevenakai aaradhana (2)
Aaradhana .. Aaradhana.. (2)

Listen to this Song

Song Details

DetailInfo
Song NameOneness Season 2
Album
Singer
Year
Others

Listen to this Song

Friendly Note

          Praise God My dear friend! Thank you for sparing your valuable time to visit our work. Your visit to this site is a great blessing to us. We are so delighted for your presence to explore our work. We are here to provide you with the best experience by visiting our site, and your click will help us to labour more for your comfort through this site.

           We are committed to providing you with a user-friendly experience and to grow spiritually along with you. I hope you visited our site for a better experience and also hope that we fulfilled your needs. Your presence is much more appreciated. Please visit your friend again and kindly help your friend by sending lyrics and useful materials to become close friends. Kindly explore us more!

🎵 Didn’t find the song you’re looking for? Click here to request it.

Leave a Comment