నను కలుగజేసిన విధము తలపోసిన | Nanu Kalugajesina Song Lyrics
Telugu Lyrics
పల్లవి: నను కలుగజేసిన విధము తలపోసిన
భయము ఆశ్చర్యము పుట్టును హృదయమందున ||2||
స్తుతులు చెల్లించుచున్న అందువలన ||2||
|| నను కలుగజేసిన ||
1. తన స్వరూపమున నరుని నిర్మించినా
అందమైన సృష్టిపైన అధికారమిచ్చినా ||2||
దేవుడు తనకంటే కొంతే నన్ను తక్కువగాను చేసెను ||2||
ఇంత కృప పొందే భాగ్యం ఏముంది నాలోన
స్తుతులు చెల్లించుచున్న అందువలన ||2||
|| నను కలుగజేసిన ||
2. మంటి దేహమున మహిమను నింపిన
శ్రేష్టమైన వైభవమును ధరింపజేసిన ||2||
దేవుడు తన గ్రంథమందు నా దినములు రాసి ఉంచెను ||2||
ఇంత ప్రేమానురాగం ఏలనో నా పైన
స్తుతులు చెల్లించుచున్న అందువలన ||2||
|| నను కలుగజేసిన ||
3. ఘనపరచదగిన మన ప్రభువు చేసిన
దివ్యమైన ఆకాశమును తారలను చూచిన ||2||
దేవుడు నన్ను దర్శించుటకు నరుడను ఏ పాటి వాడను ||2||
ఇంత ఆత్మీయ బంధం ఎందుకో నాతోనా
స్తుతులు చెల్లించుచున్న అందువలన ||2||
|| నను కలుగజేసిన ||
English Lyrics
Nanu Kalugajeesina vidhamu talaposina
bhayamu ascharyamu puttunu hrudayamanduna ||2||
stutulu chellinchuchuna anduvalana ||2||
||Nanu Kalugajesina||
1. Tana svarupamuna naruni nirminchina
andamaina srustipaina adhikaramichina ||2||
devudu tanakante konthe nannu takkuvaganu chesenu ||2||
intha krupa ponde bhagyam emundi nalona
stutulu chellinchuchuna anduvalana ||2||
||Nanu Kalugajesina||
2. Manti dehamuna mahimanu nimpina
srestamaina vaibhavamunu dharimpajesina ||2||
devuḍu tana granthamandu na dinamulu raasi unchenu ||2||
inta premanuraagam elano na paina
stutulu chellinchuchuna anduvalana ||2||
||Nanu Kalugajesina||
3. Ghana parachadagina mana prabhuvu chesina
divyamaina akasamunu thaaralanu chuchina ||2||
devudu nannu darshinchutaku narudanu ye paati vadanu ||2||
inta aathmiya bandham enduko naathona
stutulu chellinchuchuna anduvalana ||2||
||Nanu Kalugajesina||