మిత్రుడా రారమ్ము|Mithruda Rarammu
Mithruda Rarammu Song Lyrics in Telugu
పల్లవి: మిత్రుడా రారమ్ము…మిత్రుడా రారమ్ము…
మైత్రితో పార – మార్థికమైన – మాటల్ వచింతు – మన్ననతో విను
మిత్రుడా రారమ్ము…మిత్రుడా రారమ్ము…మిత్రుడా రారమ్ము….మిత్రుడా రారమ్ము…
1. పూర్వ జన్మమునందు పూర్తిగా పాపిని (2)
అందుకె ఈ బాధ – పొందుచునున్నాను (2)
అని యిట్లు మనస్సులో – అనుకొననే వద్దు (2)
అది నిజమేయైన – అది కూడ పోగొట్టు (2)
రక్షకుడున్నాడు – తత్క్షణమె రమ్ము (2)
ఆయన మానవుడై నట్టి దేవుండు (2)
ఈ మాట నమ్మిన – ఎంత ధన్యుండవు
మనస్సులో ముద్రించు…మనస్సులో ముద్రించు…కొని శాంతి పొందుము
|| మిత్రుడా రారమ్ము ||
2. ఈ జన్మమున గూడ – ఎన్నెన్నో పాపాలు (2)
చేసియున్నందున – చివరకు నరకంబె (2)
అని ఆత్మయందున – ఆలోచనెందుకు (2)
అవి సిల్వపై యేసు – అంతరింప జేసె (2)
ఆ వృత్తాంతంబును – ఆనందమున నమ్మి (2)
సుఖముగ నుండుము సూక్ష్మ మార్గంబిది నమ్మి (2)
ఎందరెన్నియన్న ఏ మాటల్ వినవద్దు
దేవ వాక్కె నిజము…దేవ వాక్కె నిజము…దిక్కులు చూడకు
|| మిత్రుడా రారమ్ము ||
3. దివ్య దేవుడు నిన్ను – దీవించును గాక (2)
భూమి చేసిన వాడు – పోషించును గాక (2)
రక్షకుండౌ క్రీస్తు – రక్షించును గాక (2)
పరమ వైద్యుడు స్వస్థ – పరచు చుండును గాక (2)
పనులన్నిని సఫల – పరచు చుండును గాక (2)
దైవాత్మ ధైర్యంబు – తెచ్చు చుండును గాక (2)
అంతాన మోక్షంబు – అందజేయును గాక
విజయము ఈ పాట…విజయము ఈ పాట…విను వారి కామెన్
|| మిత్రుడా రారమ్ము ||
Mithruda Rarammu Song Lyrics in English
Pallavi: Mithruda rarammu… mitrudaa raarammu…
Maitrito paara – maarthikamaina – maatala vachintu – mannanato vinu
Mitrudaa raarammu… mitrudaa raarammu…
Mitrudaa raarammu… mitrudaa raarammu…
1. Poorva janmamu nandu poorthigaa paapini (2)
Anduke ee baadha – ponduchununnaanu (2)
Ani itlu manassulo – anukonane vaddu (2)
Adi nijameyaina – adi kooda pogottu (2)
Rakshakudunnadu – tatkshaname rammu (2)
Aayana maanavudai natti devundu (2)
Ee maata nammina – entha dhanyundavu
Manassulo mudrinchu… manassulo mudrinchu…
Koni shaanti pondumu
|| Mitrudaa raarammu ||
2. Ee janmamuna gooda – ennenno paapalu (2)
Chesiyunnanduna – chivaraku narakambe (2)
Ani aatmayanduna – aalochanenduku (2)
Avi siluva pai Yeshu – antarinpa jese (2)
Aa vruttaantambunu – aanandamuna nammi (2)
Sukhamuga nundumu – sookshma maargambidi nammi (2)
Endarenniyanna – ee maatala vinavaddhu
Deva vaakke nijamu… deva vaakke nijamu…
Dikkulu choodaku
|| Mitrudaa raarammu ||
3. Divya devudu ninnu – deevinchunu gaaka (2)
Bhoomi chesina vaadu – poshincunu gaaka (2)
Rakshakundau Kreestu – rakshinchunu gaaka (2)
Parama vaidyudu swastha – parachu chundunu gaaka (2)
Panulannini safala – parachu chundunu gaaka (2)
Daivaatma dhairyambu – techchu chundunu gaaka (2)
Antaana mokshambu – andacheyunu gaaka
Vijayamu ee paata… vijayamu ee paata…
Vinu vaari kaamen
|| Mitrudaa raarammu ||
Listen to this Song
Friendly Note
Praise God My dear friend! Thank you for sparing your valuable time to visit our work. Your visit to this site is a great blessing to us. We are so delighted for your presence to explore our work. We are here to provide you with the best experience by visiting our site, and your click will help us to labour more for your comfort through this site.
We are committed to providing you with a user-friendly experience and to grow spiritually along with you. I hope you visited our site for a better experience and also hope that we fulfilled your needs. Your presence is much more appreciated. Please visit your friend again and kindly help your friend by sending lyrics and useful materials to become close friends. Kindly explore us more!