ఎన్ని తలచినా ఏది అడిగినా | Enni Thalachina Edi Adigina Song Lyrics in Telugu
Song Name: Enni Thalachina Edi Adigina
Telugu Lyrics
పల్లవి: ఎన్ని తలచినా ఏది అడిగినా
జరిగేది నీ చిత్తమే (2) ప్రభువా
నీ వాక్కుకై వేచియుంటిని
నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా
1. నీ తోడు లేక నీ ప్రేమ లేక
ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు (2)
అడవి పూవులే నీ ప్రేమ పొందగా (2)
నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా
||ఎన్ని||
2. నా ఇంటి దీపం నీవే అని తెలసి
నా హృదయం నీ కొరకై పదిలపరచితి (2)
ఆరిపోయిన నా వెలుగు దీపము (2)
వెలిగించుము నీ ప్రేమతో (2) ప్రభువా
||ఎన్ని||
3. ఆపదలు నన్ను వెన్నంటియున్నా
నా కాపరి నీవై నన్నాదుకొంటివి (2)
లోకమంతయూ నన్ను విడచినా (2)
నీ నుండి వేరు చెయ్యవు (2) ప్రభువా
||ఎన్ని||
4. నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి
నా కొరకై కల్వరిలో యాగమైతివి (2)
నీదు యాగమే నా మోక్ష మార్గము (2)
నీయందే నిత్యజీవము (2) ప్రభువా
||ఎన్ని||