ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్య | Endukintha Prema Naapai Chupavu Yesayya Song Lyrics in Telugu | ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు
Song Name: Endukintha Prema Naapai Chupavu Yesayya
Lyrics in Telugu:
పల్లవి: ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు
మమ్ము కాపాడిన మా దేవా – ఇదియే మా జిహ్వార్పణ (2)
అనుపల్లవి: ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్య
ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెదా (2)
|| ఇశ్రాయేలును||
1. గోతిలోనికి దిగిన… మన్ను నిన్ను స్తుతించునా
గళమెత్తి పాడగలనా…. మృతుల లోకానా?
సజీవులు సజీవులే నిన్ను స్తుతియించెదరు (2)
ఈ కంఠము మూగబోకముందే ఆరాధించెదా (2)
|| ఎందుకింత||
2. నిరీక్షణే లేక… కలవరము చెందగా
అడుగులు తడబడగా – ఆప్తులే దూరమైన
వాత్సల్య కటాక్షములు – ఎంతో ఉన్నతమై (2)
గొప్ప కార్యములు నా యెడల చేసియున్నావు (2)
|| ఎందుకింత||
3. ఇన్నాళ్లకైనా…. ఫలములు కాయకున్న
నాకై నీవిచ్చిన… వనరులే వ్యర్ధమైన
ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మని (2)
విజ్ఞాపనము చేయుచున్న ప్రధాన యాజక (2)
|| ఎందుకింత||