Amkitham Prabhu Naa Jeevitham Song Lyrics

Song Name: Amkitham Prabhu Naa Jeevitham

Telugu Lyrics

పల్లవి: అంకితం ప్రభూ నా జీవితం – నీ చరణాల సేవకే అంకితమయ్యా – 2
నీ సేవకై ఈ సమర్పణా – అంగీకరించుము నాదు రక్షకా – 2

1. మోడుబారిన నా జీవితం – చిగురింపజేసావు దేవా
నిష్ఫలమైన నా జీవితం – ఫలియింపజేసావు ప్రభువా
నీ కృపలో బహుగా ఫలించుటకు – ఫలింపని వారికి ప్రకటించుటకు – 2
అంగీకరించుము నా సమర్పణ

2. కారు చీకటి కాఠిన్య కడలిలో – నీ కాంతినిచ్చావు దేవా
చీకటిలోనున్న నా జీవితం – చిరుదివ్వెగా చేసావు ప్రభువా
నీ సన్నిధిలో ప్రకాశించుటకు – అంధకార ఛాయలను తొలగించుటకు – 2
అంగీకరించుము నా సమర్పణ

Listen this Song

Sharing Is Caring: