Aashatho Nee Koraku Song Lyrics

ఆశతో నీ కొరకు ఎదురుచూచుచుండగా | Aashatho Nee Koraku Song Lyrics in Telugu | Ramya Behara | Latest Christian Songs

Song Name: Aashatho Nee Koraku

Telugu Lyrics

పల్లవి: ఆశతో నీ కొరకు ఎదురుచూచుచుండగా
నూతన బలముతో నను నింపినావు (2)
బలహీనులను బలపరచువాడా
కృంగిన వారిని లేవనెత్తువాడా (2)

అను పల్లవి: యేసయ్యా నా ఆశ్రయమా
యేసయ్యా నీకే ఆరాధన (2)

||ఆశతో||

1. సొమ్మసిల్లక అడుగులు తడబడక
నడిచెద నీ వెంట జీవితమంతా (2)
లోకము నన్ను ఆకర్షించినా
వెనుదిరుగక నేను సాగెద నీ వెంట (2)

||యేసయ్యా||

2. అలయక నేను పరుగెత్తెదను
అంతము వరకు ఆత్మల రక్షణకై (2)
సిద్ధము చేసిన బహుమానముకై
గురియొద్దకే నేను సాగెదనయ్యా (2)

||యేసయ్యా||

3. రెక్కలు చాపి పక్షి రాజువలెనే
పైకెగెరెద నీ పరిశుద్ధులతో (2)
పరవశించెదను నీ ముఖమును చూచి
ప్రణమిల్లెద నీ పాదముల చెంత (2)

||యేసయ్యా||

Watch Song

For More Songs
Christmas Songs
New Year Songs
Sharing Is Caring: