ఏకాంత స్థలము కోరుము | Yekantha Sthalamu Korumu
Yekantha Sthalamu Korumu Song Lyrics in Telugu
ఏకాంత స్థలము కోరుము – దేవుని ప్రార్ధింప
ఏకాంత స్థలము చేరుము (2)
ఏకాంత స్థలము చేరి మోకాళ్ళ మీదవుండి (2)
లోకాశలను మదికి రాకుండ చూచుకొనుము (2)
|| ఏకాంత ||
ఊహలోని పాపములను – ఒప్పుకొనుము తండ్రియెదుట (2)
దేహము లోపలకవియె – దిగుచు నిన్ను బాధ పెట్టును (2)
|| ఏకాంత ||
మాటలందలి పాపములను – మన్నించుమని వేడుకొనుము (2)
ఆట పాటలందుమాట – లాడుటయు నేరంబులగును (2)
|| ఏకాంత ||
చేయబోయి మానుచెడ్డ – చేతలన్ని ఒప్పుకొనుము (2)
ఈయత్న పాపంబులెల్ల – ఎన్నిక లోనికి వచ్చును గాన (2)
|| ఏకాంత ||
పాప క్రియలు అని దుఃఖముముతో -ప్రభుని యెదుట ఒప్పుకొనుము (2)
పాపము మరల చేయనట్టి – ప్రయత్నంబుల్ చేయవలెను (2)
|| ఏకాంత ||
ఎవరిని అల్లరి పెట్టినావో – వారియొద్ద ఒప్పుకొనుము (2)
ఎవరియొద్ద చెప్పినావో – వారియొద్ద ఒప్పు కొనుము (2)
|| ఏకాంత ||
తప్పు వినుట సర్ధాయైన – తప్పే తప్పు ఒప్పు కొనుము (2)
తప్పు తట్టు ఆకర్షించు – తగని ఆట పాట లేల (2)
|| ఏకాంత ||
కలలో చేసిన తప్పులెల్ల – కర్త యెదుట ఒప్పుకొనుము (2)
తలపులో లేనిది యెట్లు – కలలోనికి వచ్చియుండును (2)
|| ఏకాంత ||
నిన్ను మరల సిలువవేసి – యున్న పాప జీవినయ్యో (2)
నన్ను క్షమియించుమని – యన్న నరులు మారువారు (2)
|| ఏకాంత ||
చెడుగుమాని మంచిపనులు – చేయకున్న పాపమగును (2)
పడియు లేవకున్న గొప్ప – పాపమగును పాపమగును (2)
|| ఏకాంత ||
దుష్టులు వర్ధిల్లుట చూచి – కష్టము పెట్టుకొనరాదు (2)
కష్టము పెట్టుకొన్న నీవు – దుష్టుడవుగా మారినట్టే (2)
|| ఏకాంత ||
భక్తిపరుల శ్రమలు చూచి – భక్తిహీనులని యనవద్దు (2)
భక్తుల శ్రమలకు ముందు – బహుమానంబు దొరుక గలదు (2)
|| ఏకాంత ||
బీదల కాహారము బెట్ట – వెనుకదీసి పొమ్మనరాదు (2)
నీ ధనము నీకేకాదు అది నినుగని దేహియను వారికిని (2)
|| ఏకాంత ||
రొగులను దర్శింపబోవ – రోతయని భావింపవద్దు (2)
బాగుపడు పర్యంతమువరకు – పరిచర్యచేయుట మెప్పు (2)
|| ఏకాంత ||
ఎట్టియబద్దాలు పలుకు – నట్టివారికి నరకమచు (2)
చిట్టచివరి పుస్తకంబు – చెప్పునది యోచన చేయుము (2)
|| ఏకాంత ||
జీవరాసులను బాదుట – జీవహింస నేరమౌను (2)
దేవుడు నిన్నడుగజెప్పు తెగువగలుగ గలదా నీకు (2)
|| ఏకాంత ||
ఒకరి వంకమీదపెట్టి – ఒకరిననుట పిరికితనము (2)
ముఖము యె దుట అడిగి స్నేహ – మును గలిగించు కొనుట మెరుగు (2)
|| ఏకాంత ||
గుడిలో కూర్చుని కార్యక్రమము – గుర్తింపకుండుట యశ్రద్ద (2)
చెడగొట్టి వేయు చుండు – పెడచూపు మనోనిదానము (2)
|| ఏకాంత ||
వాక్యాహారము తిననియెడల – బలమాత్మకు లభించుటెట్లు (2)
వాక్య గ్రంధములోని దేవుని – పలుకువినక నడచుటెట్లు (2)
|| ఏకాంత ||
దినప్రార్ధనలు చేయని యెడల – దేవునిశ్వాస పొందుటెట్లు (2)
మనసులోని స్వీయశ్వాస – మలినము పోవుటెట్లు (2)
|| ఏకాంత ||
పరులకు బోధించు సేవ – జరుపలేక యున్నయెడల (2)
పరమభక్తి పరులకైన – బహుమానంబు దొరుకుటయెట్లు (2)
|| ఏకాంత ||
ప్రభువుకొరకు పనిచేసిన – వారికి తాను బాకీ పడడు (2)
సభ నిమిత్తము చేసినది తన – స్వంతము కన్నట్టె యెంచు (2)
|| ఏకాంత ||
చందా నీది కాదు క్రీస్తు – సంఘాభివృద్ధికె చెందు (2)
చందావే యుము ప్రభువు నీకే – చందవేయును నీకు అరోధి (2)
|| ఏకాంత ||
యేసు నామమందు మనము – యేదిచేసిన సఫలమగును (2)
యేసుక్రీస్తు పేరును చేయు – నేదైన దేవునికి మహిమ (2)
|| ఏకాంత ||
దేవా! నాకు కనబడుమన్న – దేవదర్శనమగును నీకు (2)
పావనం బగు రూపముచూచి – బహుగా సంతోషించగలవు (2)
|| ఏకాంత ||
దేవా! మాటలాడుమన్న – దేవవాక్కు వినబడు నీకు (2)
నీవు అడిగి న ప్రశ్నలకెల్ల – నిజము తెలియనగును నీకు (2)
|| ఏకాంత ||
తప్పు వివరము చెప్పకుండ – తప్పుమన్నించుమనియన్న (2)
తప్పు తప్పుగానేయుండు – తప్పుదారివృద్ధిపొందు (2)
|| ఏకాంత ||
ఏడు తరగతులున్నవి నీది – ఏదో తెలిసికొనుము యిపుడే (2)
కీడు మాని మంచి చేసిన – క్రిందితరగతి దొరుకునేమో (2)
|| ఏకాంత ||
నరుల మీద ప్రేమ క్రీస్తు – వరునిమీద ప్రేమయున్న (2)
పరలోకమున వరుడు ఉన్న – పైతరగతిలోనే చేరుదువు (2)
|| ఏకాంత ||
ఆలోచింపకుండ ప్రశ్న – అడుగవద్దు నరుడుకాడు (2)
నీలోని జ్ఞానము వలన – నిరుకు తెలిసిన నడుగనేల (2)
|| ఏకాంత ||
మోటుమాట – లాడవద్దు – మోటుపనులు చేయవద్దు (2)
చాటున చేసిన పాపములు – సమయమపుడు బైలుపడును (2)
|| ఏకాంత ||
ఉత్తర మాలస్యముగావచ్చిన – ఉత్తరమసలే రాకయున్న (2)
ఉత్తమ విశ్వాసమును ప్రార్ధన – ఉత్తవియైపోవును విచారము (2)
|| ఏకాంత ||
వ్యర్ధమైన ఊహాలు మాటలు – పనులు నిన్ను వ్యర్ధపర్చును (2)
తీర్ధమువలెనె పాపముత్రాగిన – తీర్పు శిక్ష సహింపజాలవు (2)
|| ఏకాంత ||
ఏపాపమునకైన పరుల – కే శిక్షయును రాకుండెను (2)
నా పాప ములకు శిక్షకలుగు-నా? యన్న అజ్ఞానమగును (2)
|| ఏకాంత ||
Yekantha Sthalamu Korumu Song Lyrics in English
Yekantha Sthalamu Korumu – Devuni Prardhimpa
Yekantha Sthalamu Cherumu (2)
Yekantha Sthalamu Cheri Mokaḷḷa Meedavundi (2)
Lokaashalanu Madiki Raakunda Choochukonumu (2)
|| Yekantha ||
Oohaloni Paapamulanu – Oppukonumu Tandriyeduta (2)
Dehamu Lopalakaviye – Diguchu Ninnu Baadha Pettunu (2)
|| Yekantha ||
Maatalandali Paapamulanu – Manninchumani Vedukonumu (2)
Aata Paatalandu Maata – Laadutayu Nerambulagunu (2)
|| Yekantha ||
Cheyaboyi Maanuched – Chetalanni Oppukonumu (2)
Eeyatna Paapambulalla – Ennika Loniki Vachunu Gaana (2)
|| Yekantha ||
Paapa Kriyalu Ani Duhkhamumuto – Prabhuni Yeduta Oppukonumu (2)
Paapamu Marala Cheyanatti – Prayatanambul Cheyavalenu (2)
|| Yekantha ||
Evarini Allari Pettinavo – Variyodda Oppukonumu (2)
Evariyodda Cheppinavo – Variyodda Oppukonumu (2)
|| Yekantha ||
Tappu Vinuta Sardhaayaina – Tappe Tappu Oppukonumu (2)
Tappu Tattu Aakarshinchu – Tagani Aata Paata Lela (2)
|| Yekantha ||
Kalalo Chesina Tappulella – Karta Yeduta Oppukonumu (2)
Talapulo Lenidi Yetlu – Kalaloniki Vachiyundunu (2)
|| Yekantha ||
Ninnu Marala Siluvavesi – Unna Paapa Jeevinayyo (2)
Nannu Kshamiyinchumani – Anna Narulu Maaruvaaru (2)
|| Yekantha ||
Chedgumani Manchi Panulu – Cheyakunna Paapamagunu (2)
Padiyu Levakunna Goppa – Paapamagunu Paapamagunu (2)
|| Yekantha ||
Dushtulu Vardhilluta Chuchi – Kashtamu Pettukonaraadu (2)
Kashtamu Pettukonna Nevu – Dushtudavuga Maarinatte (2)
|| Yekantha ||
Bhaktiparula Sramalu Chuchi – Bhaktiheenulani Yanavaddhu (2)
Bhaktula Sramalaku Mundu – Bahumaanambu Dorukagaladu (2)
|| Yekantha ||
Beedala Kaahaaramu Betta – Venukadisi Pommana Raadu (2)
Nee Dhanamu Neekekaadu – Adi Ninugani Dehiyanu Vaarikini (2)
|| Yekantha ||
Rogulanu Darshimpabova – Rodayani Bhaavimpavaddhu (2)
Baagupadu Paryantamuvarku – Paricharyacheyuta Meppu (2)
|| Yekantha ||
Ettiyabaddalu Paluku – Nattivaariki Narakamachu (2)
Chittachivari Pustakambu – Cheppunadi Yochana Cheyyumu (2)
|| Yekantha ||
Jeevaraasulanu Baaduta – Jeevahimsa Neramaunu (2)
Devudu Ninnadugajeppu – Teguvagaluga Galada Neeku (2)
|| Yekantha ||
Okarivankamidapetti – Okarinanuta Pirikitanamu (2)
Mukhami Yeduta Adigi Sneeha – Munu Galiginchu Konuta Merugu (2)
|| Yekantha ||
Gudilo Kurchuni Karyakramamu – Gurtimpakunduta Yashraddha (2)
Chedagottee Veyu Chundu – Pedachupu Manonidanamu (2)
|| Yekantha ||
Vaakyaharamu Tinaniyedala – Balam Aatmaku Labhinchutettu (2)
Vaakya Grandhamuloni Devuni – Paluku Vinaka Nadachutettu (2)
|| Yekantha ||
Dinaprardhanalu Cheyyaniyeda – Devunishwasa Pondutettu (2)
Manasuloni Sweeyashwasa – Malinamu Povutettu (2)
|| Yekantha ||
Parulaku Bodhincu Seva – Jarupaleka Yunnayedala (2)
Paramabhakti Parulakaina – Bahumaanambu Dorukutayettu (2)
|| Yekantha ||
Prabhvukoraku Panichesina – Vaariki Tanu Baaki Padadu (2)
Sabha Nimitamu Chesinadi Tana – Swantamu Kannatte Yenchu (2)
|| Yekantha ||
Chandaa Needikadu Kreeshtu – Sanghaabhivrdhike Chendu (2)
Chandaa Veyumu Prabhuvu Neeke – Chandaveyunu Neeku Aarodhi (2)
|| Yekantha ||
Yesu Naamamandu Manamu – Yedi Chesina Saphalamagunu (2)
Yesu Kreeshtu Perunu Cheyu – Nedaina Devuniki Mahima (2)
|| Yekantha ||
Deva! Naaku Kanabadumanna – Devadarshanamagunu Neeku (2)
Paavanamagu Roopamuchuchi – Bahuga Santoshinchagalavu (2)
|| Yekantha ||
Deva! Maatalaadumanna – Devavaakku Vinabadu Neeku (2)
Neevu Adigi Na Prashnalakella – Nijamu Teliyanagunu Neeku (2)
|| Yekantha ||
Tappu Vivaramu Cheppakunda – Tappumanninchumaniyanna (2)
Tappu Tappuga Neyundu – Tappudaarivruddhipondu (2)
|| Yekantha ||
Edu Taragatulunnavi Needi – Edo Telisikoonu Yipude (2)
Keedu Maani Manchi Chesina – Krinditaragati Dorukunemo (2)
|| Yekantha ||
Narula Meeda Prema Kreeshtu – Varunimeeda Premayunna (2)
Paralokamuna Varudu Unna – Paitaragatilone Cherudavu (2)
|| Yekantha ||
Aalochinpakunda Prashna – Adugavaddhu Narudukaadu (2)
Neeloni Gnaalamu Valana – Niruku Telisina Nadugunela (2)
|| Yekantha ||
Motu Maata – Laadavaddhu – Motu Panulu Cheyavaddhu (2)
Chaatuna Chesina Paapamulu – Samayamu Apudu Bailupadunu (2)
|| Yekantha ||
Uttara Maalasyamuga Vachina – Uttaramasale Raakuyunna (2)
Uttama Vishwasamunu Prardhana – Uthtaviyai Povunu Vicharamu (2)
|| Yekantha ||
Vyarthamaina Oohalu Maatalu – Panulu Ninnu Vyarthaparachunu (2)
Teerdhamu Valene Paapamutraagina – Teerpu Shiksha Sahimpajaalavu (2)
|| Yekantha ||
Ye Paapamunakaina Parul – Ke Shikshayunu Raakundenu (2)
Naa Paapamulaku Shiksha Kaluguna? – Yanna Ajnanamugunu (2)
|| Yekantha ||
Listen to this Song
Friendly Note
Praise God My dear friend! Thank you for sparing your valuable time to visit our work. Your visit to this site is a great blessing to us. We are so delighted for your presence to explore our work. We are here to provide you with the best experience by visiting our site, and your click will help us to labour more for your comfort through this site.
We are committed to providing you with a user-friendly experience and to grow spiritually along with you. I hope you visited our site for a better experience and also hope that we fulfilled your needs. Your presence is much more appreciated. Please visit your friend again and kindly help your friend by sending lyrics and useful materials to become close friends. Kindly explore us more!