కృపగల దేవుడవు నీ కృపలో కాపాడావు | Krupagala Devudavu New Year Song Lyrics in Telugu | Telugu Christian New Year Songs
Song Name: Krupagala Devudavu
Lyrics in Telugu:
అను పల్లవి: యేసు నా వెంటే ఉన్నావు యేసు నాకు తోడైయున్నావు
పల్లవి: కృపగల దేవుడవు నీ కృపలో కాపాడావు
దయగల దేవుడవు నీ దయ నాపై చూపావు (2)
గడచినా కాలమంతా నీవిచ్చినా బహుమానమే
నేనున్నా ఈ క్షణం కేవలం నీ కృపే
యేసు నా వెంటే ఉన్నావు యేసు నాకు తోడైయున్నావు (2)
1. ఏ అపాయము నన్ను సమీపించక
ఏ కీడు నా దరికి చేరక (2)
ఆపదలో నుండి విడిపించావు
అనుదినము నన్ను కృపతో కాచావు (2)
యేసు నా వెంటే ఉన్నావు యేసు నాకు తోడైయున్నావు (2)
||యేసు నా వెంటే||
2. ఇన్నినాళ్ళు నాకు తోడై
ఎన్నో మేలులతో దీవించావు (2)
విడువక యెడబాయక తోడైయున్నావు
శాశ్వత ప్రేమను నాపై చూపావు
యేసు నా వెంటే ఉన్నావు యేసు నాకు తోడైయున్నావు (2)
||యేసు నా వెంటే||