నూతన సంవత్సరం దయచేసిన దేవా నీకే స్తోత్రములు అద్వితీయ ప్రభువా | Noothana Samvathsaram Dayachesina Devaa Song Lyrics in both Telugu and English | Christian New Year Song
Song Name: Noothana Samvathsaram Dayachesina Devaa
Telugu Lyrics:
పల్లవి: నూతన సంవత్సరం దయచేసిన దేవా
నీకే స్తోత్రములు అద్వితీయ ప్రభువా (2)
ఆశ్చర్యకరుడవు ఆది సంభూతుడవు (2)
అద్భుతకరుడవు అల్ఫా ఓమెగవు (2)
||నూతన ||
1. పాపాంధకారమునకు బానిసనై యున్నప్పుడు
శాపముతో నేను హీనుడనై యున్నప్పుడు
చేతులు చాచి నన్ను లేవనెత్తిన దేవా
ప్రేమతో పిలిచి నన్ను ఆదరించిన ప్రభువా
నీ ప్రేమ పిలుపుకు నే ఘనుడనైతిని
నీ స్పర్శ తాకిడికి ఆత్మ పూర్ణుడైతిని
||నూతన||
2. కడవరి దినాలలో కంట నీరు పెడుతుండగా
కష్టాలతో నేను సతమతమౌతుండగా
నీ వాక్య వెలుగులో నడిపించిన నా ప్రభువా
ఏ దిక్కు లేని నాకు దారి చూపిన తండ్రి
నీ జాలి హృదయమునకు దాసుడ నేనైతిని
నీ వాక్య జ్ఞానమునకు పరిచారకుడనైతిని
||నూతన||
English Lyrics:
Noothana Samvathsaram Dayachesina Devaa
Neeke Sthothramul Advitheeya Prabhuvaa (2)
Aascharyakarudavu Aadi Sambhoothudavu (2)
Adbhuthakarudavu Alphaa Omegavu (2)
||Noothana||
1. Paapaandhakaaramunaku Baanisanai Yunnappudu
Shaapamtho Nenu Heenudanai Yunnappudu
Chethulu Chaachi Nannu Levanetthina Devaa
Prematho Pilichi Nannu Aadarinchina Prabhuvaa
Nee Prema Pilupuku Ne Ghanudanaithini
Nee Sparsha Thaakidiki Aathma Poornudaithini
||Noothana||
2. Kadavari Dinaalalo Kanta Neeru Peduthundagga
Kashtaalatho Nenu Sathamathamauthundagaa
Nee Vaakya Velugulo Nadipinchina Naa Prabhuvaa
Ae Dikku Leni Naaku Daari Choopina Thandri
Nee Jaali Hrudayamunaku Daasuda Nenaithini
Nee Vaakya Gnaanamunaku Parichaarakudanaithini
||Noothana||